Share News

ఒడిశాలో నక్సల్స్‌ లొంగుబాటు విధానం సవరింపు

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:16 AM

రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తొలగించి, వారిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల...

ఒడిశాలో నక్సల్స్‌ లొంగుబాటు విధానం సవరింపు

భువనేశ్వర్‌, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తొలగించి, వారిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల లొంగుబాటు, పునరావాస విధానాన్ని సవరించింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు), దాని అనుబంధ సంస్థలు, మావోయిస్టులు, వామపక్ష తీవ్రవాదులు, నక్సల్స్‌, మిలిటెంట్లకు, తుపాకులు, లేక అవి లేకుండా లొంగిపోయే క్యాడర్లుకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఒడిశాలో నిషేధిత సంస్థల కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు రాష్ట్రానికి చెందిన వారా.. కాదా అనే దానితో సంబంధం లేకుండా ఈ పథకానికి అర్హులేనని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రం వెలుపల నక్సల్స్‌ కార్యకలాపాల్లో పాల్గొన్న ఒడిశా వారిని కూడా అర్హులుగానే పరిగణిస్తామని వెల్లడించింది. అయితే వారు మరెక్కడా పునరావాస ప్రయోజనాలను పొందలేదని నిరభ్యంతర పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. .

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 06:16 AM