Share News

నేను అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ఆర్‌సీని అనుమతించను: మమతా బెనర్జీ

ABN , Publish Date - Mar 25 , 2026 | 06:33 PM

తాను అధికారంలో ఉన్నంత వరకూ పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అనుమతించేది లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నక్సల్బరీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.

నేను అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ఆర్‌సీని అనుమతించను: మమతా బెనర్జీ
Mamata Banerjee

నక్సల్‌బరీ: ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలు హక్కులు లాక్కుంటోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ఈరోజు ఓటుహక్కును లాక్కున్న వారు రేపు ఎన్ఆర్‌సీ (NRC) పేరుతో పౌరసత్వాన్ని కూడా లాక్కుంటారని విమర్శించారు. అయితే తాను అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అనుమతించేది లేదని చెప్పారు. నక్సల్‌బరీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ పాల్గొన్నారు.


'రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో నిర్దిష్ట కమ్యూనిటీలను ఎన్నికల ప్రక్రియ నుంచి మినహాయించారు. ఎస్ఐఆర్ ద్వారా రాజ్‌‍బన్షి పేర్లను తొలగించారు. మహిళల పేర్లు కూడా తొలగించారు. ఎస్ఐఆర్ వల్ల మరణాలు చోటుచేసుకుంటే దానికెవరు బాధ్యత వహిస్తారు?' అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఎన్నికల కమిషన్, బీజేపీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇవాళ ప్రజల ఓటింగ్ హక్కులను లాక్కున్న వారు రేపు ఎన్‌ఆర్‌సీ పేరుతో పౌరసత్వ హక్కులను లాక్కుంటారని ఆరోపించారు.


సీఈసీ జ్ఞానేశ్ కుమార్, నరేంద్ర మోదీ, అమిత్‌షా పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, ఈ ముగ్గురికీ ఓటర్లు ఉద్వాసన పలకాలని కోరారు. 'వాళ్లు నానుంచి అన్నీ లాక్కున్నారు. ఇప్పుడు నా చేతుల్లో ఉన్నదల్లా ప్రజలు మాత్రమే' అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

23 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి పళనిస్వామి పోటీ

Updated Date - Mar 25 , 2026 | 06:36 PM