భాషలపై దురభిమానం వద్దు
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:12 AM
పరాయి రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారందరికీ భాషాభిమానం ఉండాలిగానీ, ఇతర భాషలపై దురభిమానం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చెన్నైలో ఆదివారం సాయంత్రం శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్
చెన్నై, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పరాయి రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారందరికీ భాషాభిమానం ఉండాలిగానీ, ఇతర భాషలపై దురభిమానం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చెన్నైలో ఆదివారం సాయంత్రం శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు ప్రజలు విద్య, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో జీవిస్తున్నప్పటికీ మాతృభాషతో పాటు ఆయా రాష్ట్రాల భాష, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ, ఆర్థిక రంగంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకెళ్తూ ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’