Share News

నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభం..

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:46 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది.

నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభం..
Nitin Nabin

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది.


ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.


మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి.


ఈ వార్తలు కూడా చదవండి

నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన..

ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Updated Date - Aug 22 , 2026 | 12:03 PM