Share News

పాఠశాల విద్యను సంస్కరించాలి

ABN , Publish Date - May 08 , 2026 | 04:22 AM

దేశంలోని విద్యా వ్యవస్థలో లోపాలను నీతి ఆయోగ్‌ ఎత్తిచూపింది. ప్రాథమిక విద్యలో వివిధ రకాలుగా విభజితమైన పాఠశాలలు...

పాఠశాల విద్యను సంస్కరించాలి

  • నీతి ఆయోగ్‌ నివేదికలో సూచన

న్యూఢిల్లీ, మే 7: దేశంలోని విద్యా వ్యవస్థలో లోపాలను నీతి ఆయోగ్‌ ఎత్తిచూపింది. ప్రాథమిక విద్యలో వివిధ రకాలుగా విభజితమైన పాఠశాలలు, అభ్యసనంలో అంతరాలు, మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు, ఉపాధ్యాయుల కొరత, పాలనలో బలహీనతలు పాఠశాల విద్యలో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు అని స్పష్టం చేసింది. దీని కోసం పలు సంస్కరణలను సూచించింది. వాటిలో మిశ్రమ స్కూల్‌ కాంప్లెక్స్‌లు, ప్రాథమిక స్థాయిలో బలమైన పునాదులు వేసేలా విద్య, మెరుగైన ఉపాధ్యాయుల నిర్వహణతో పాటు విస్తృతంగా డిజిటల్‌ వినియోగం, ఏఐ ఆధారిత విద్య వంటి వాటిని సిఫారసు చేసింది. ‘భారత్‌లో పాఠశాల విద్యా వ్యవస్థలో నాణ్యత పెంపునకు కాలానుగుణ విశ్లేషణ, పాలసీ రోడ్‌మ్యాప్‌’ అనే పేరు తో విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్‌ పలు అంశాలు పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 04:22 AM