Share News

బిహార్‌ మంత్రివర్గంలోకి నితీశ్‌ కుమారుడు

ABN , Publish Date - May 08 , 2026 | 04:18 AM

బిహార్‌ ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుమారుడు...

బిహార్‌ మంత్రివర్గంలోకి నితీశ్‌ కుమారుడు

పట్నా, మే 7 : బిహార్‌ ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుమారుడు నిషాంత్‌ కుమార్‌ సహా 32 మంది నేతలు మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా అతిథులుగా విచ్చేశారు. కాగా, బిహార్‌లో బీజేపీ, జేడీయూ, ఇతర పార్టీలతో కలిసిన ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. అయితే, బీజేపీ నుంచి 15 మంది, జేడీయూ నుంచి 13 మంది, లోక్‌జన శక్తి పార్టీ(రామ్‌ విలాస్‌) నుంచి ఇద్దరు, హిందుస్థానీ అవామ్‌ మోర్చ(హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్‌ మోర్చ(ఆర్‌ఎల్‌ఎం) నుంచి ఒకొక్కరు చొప్పున మొత్తం 32 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 04:18 AM