Share News

నిసర్గకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:20 AM

సీబీఎస్ఈ ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ మూల్యాంకన ప్రక్రియలో లోపాలను బయట పెట్టిన 19 ఏళ్ల నిసర్గ అధికారికి అరుదైన గౌరవం దక్కింది

నిసర్గకు అరుదైన గౌరవం
nisargaadhikary

  • అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌

  • హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 : సీబీఎస్ఈ ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ మూల్యాంకన ప్రక్రియలో లోపాలను బయట పెట్టిన 19 ఏళ్ల నిసర్గ అధికారికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా న్యాయ విభాగానికి చెందిన హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో అతడి పేరును చేర్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సిస్టమ్‌లో వారం క్రితం సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన లోపాన్ని కనుగొన్నానని తెలిపాడు. ఈ విషయమై వారికి తెలియజేయగానే దాన్ని సరిచేశారన్నాడు. తాను చేసిన సహాయాన్ని గుర్తించి తన పేరును హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చారని పేర్కొన్నాడు. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌జస్టిస్‌ వెబ్‌సైట్‌ను బ్రౌజ్‌ చేసినప్పుడు కస్టమ్‌ స్క్రిప్ట్ లను ఉపయోగించి ఈ లోపాలను కనుగొన్నట్లు చెప్పాడు. దీంతో వెంటనే డీఏజీకి, అమెరికా మిలటరీకి తెలియజేయగా వాటిని సరిచేశారని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఒమన్ సమీపంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి

యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్

Updated Date - Sep 24 , 2026 | 04:29 AM