Share News

‘టీసీఎస్‌ కేసు’లో నిదా ఖాన్‌ అరెస్టు

ABN , Publish Date - May 08 , 2026 | 04:29 AM

మహారాష్ట్రలోని నాసిక్‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) యూనిట్‌లో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు...

‘టీసీఎస్‌ కేసు’లో నిదా ఖాన్‌ అరెస్టు

నాసిక్‌, మే 7: మహారాష్ట్రలోని నాసిక్‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) యూనిట్‌లో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఛత్రపతి సంభాజీనగర్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సిట్‌ అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం ఆమెను నాసిక్‌ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ ఏడాది మార్చి 26న కేసు నమోదైనప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 04:29 AM