Share News

టోల్‌ దాటితే.. వాహన బీమా గుట్టురట్టు!

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:50 AM

వాహనదారులు ఇకపై వాహన బీమా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదు.

టోల్‌ దాటితే.. వాహన బీమా గుట్టురట్టు!
toll

న్యూఢిల్లీ, నవంబరు 17: వాహనదారులు ఇకపై వాహన బీమా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదు. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేని, కాలం చెల్లిన బీమా కలిగిన వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాలను దాటిన వెంటనే.. ఆ వివరాలు అధికారులకు తెలిసిపోనున్నాయి. అంతేకాక, సంబంధిత వాహన యజమాని మొబైల్‌ నెంబర్‌కు నిమిషాల వ్యవధిలో హెచ్చరిక సందేశం కూడా వచ్చేస్తుంది. వాహన యజమానులు తమ వాహనాలకు తప్పనిసరిగా బీమా చేయించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది. న్యూఢిల్లీలోని యూఈఆర్‌(అర్బన్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌)-2లోని ముండ్కా టోల్‌ ప్లాజాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని టోల్‌ ప్లాజాల్లో ఈ విధానాన్ని అమలు చేయనుంది. థర్ట్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేని, ఇన్సూరెన్స్‌ ఎక్స్‌పైరీ అయిన వాహనాలు టోల్‌ ప్లాజాను దాటిన వెంటనే.. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) ఆధ్వర్యంలోని వాహన డేటాబే్‌సకు ఆ వివరాలు వెళతాయి. అక్కడ వాహన బీమా వివరాల పరిశీలన ఆటోమేటిక్‌గా జరుగుతుంది. చెల్లుబాటయ్యే బీమా లేకుంటే వాహన రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్‌ నెంబర్‌కు సందేశం వెళుతుంది. ఇన్సూరెన్స్‌ లేని వాహనదారులు తొలిసారి పట్టుబడినప్పుడు వాహన బీమా బేస్‌ ప్రీమియంకు మూడు రెట్లు లేదా గరిష్ఠంగా రూ.5,000 జరిమానా చెల్లించాలి. మళ్లీ పట్టుబడితే గరిష్ఠంగా రూ.10,000 వరకు ఫైన్‌ కట్టాలి.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి

గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా

Updated Date - Nov 18 , 2026 | 05:40 AM