Share News

మోదీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టరు?.. న్యూజిలాండ్ జర్నలిస్ట్ ప్రశ్న

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:30 PM

ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ కమ్యూనికేషన్ స్టైల్‌పై అంతర్జాతీయ మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ స్థానిక జర్నలిస్ట్ నేరుగా దౌత్యవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు? అని ప్రశ్నించారు.

మోదీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టరు?.. న్యూజిలాండ్ జర్నలిస్ట్ ప్రశ్న
New Zealand Journalist Asks Why PM Modi Doesn't Hold Press Conferences

ఆక్లాండ్ (న్యూజిలాండ్)జులై 11: ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌లో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ కమ్యూనికేషన్ స్టైల్‌పై అంతర్జాతీయ మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భారత రాయబార కార్యాలయ అధికారులతో జరిగిన ఓ ముఖాముఖి సమావేశంలో, ఓ స్థానిక జర్నలిస్ట్ నేరుగా దౌత్యవేత్తలను ఉద్దేశించి 'ప్రధాని మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు?' అని ప్రశ్నించారు.


దీనికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) సీనియర్ అధికారి, ప్రముఖ దౌత్యవేత్త రుద్రేంద్ర టాండన్ అత్యంత చాకచక్యంగా స్పష్టమైన సమాధానమిచ్చారు.

ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడమే మోదీ శైలి

జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ అధికారి రుద్రేంద్ర టాండన్ స్పందిస్తూ.. ప్రధాని రాజకీయ వ్యూహాలను ఒక ప్రభుత్వ అధికారిగా తాను ప్రశ్నించలేనని చెప్తూనే, భారతీయ రాజకీయాల నేపథ్యాన్ని వివరించారు. 'ప్రధాని మోదీ పక్కా భారతీయ రాజకీయవేత్త. సాధారణంగా భారతీయ నాయకులు తమ ఓటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటానికే ఇష్టపడతారు. మధ్యవర్తులు లేదా మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడటం కంటే, నేరుగా ప్రజలకే తమ సందేశాన్ని చేరవేయాలని భావిస్తారు' అని టాండన్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఈ 'డైరెక్ట్ కాంటాక్ట్' విధానంలో అద్భుతమైన నైపుణ్యం సాధించారని, అందువల్లే ఆయన భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానులలో ఒకరిగా నిలిచారని గుర్తుచేశారు. ప్రజలు ఆయన విధానాన్ని ఆదరించబట్టే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చారని దౌత్యవేత్త స్పష్టం చేశారు.


నార్వేలోనూ గతంలో ఇదే తరహా ప్రశ్న

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఇలాంటి ప్రశ్నలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గత మేలో నార్వే రాజధాని ఓస్లో పర్యటన సందర్భంగా కూడా అక్కడి ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి మోదీ సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు.. హెల్ లింగ్ అనే నార్వేజియన్ జర్నలిస్ట్ ప్రధాని మోదీని ఉద్దేశించి 'మీరు జర్నలిస్టుల ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వరు?' అని బహిరంగంగా అడిగారు. అప్పట్లో ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

Updated Date - Jul 11 , 2026 | 04:52 PM