Home » Press conference
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (బుధవారం) జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్ మీడియా సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ కమ్యూనికేషన్ స్టైల్‌పై అంతర్జాతీయ మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ స్థానిక జర్నలిస్ట్ నేరుగా దౌత్యవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు? అని ప్రశ్నించారు.
ఇటీవల నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ విమర్శలు చేశారు. జగన్ చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు నాగరికతను జోడిస్తూ కౌంటర్ ఇచ్చారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సాధ్యమైనంత త్వరగా ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున తొలి విడత ఎస్ఐఆర్‌లో ఆ రాష్ట్రాలు చోటుచేసుకోనున్నాయి.
జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించాలనే అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. యూట్యూబ్ చానళ్లు, డిజిటల్ పేపర్ల జర్నలిస్టులమని కార్యాలయానికి వస్తోన్న కొందరు అధికారుల విధినిర్వహణకు భంగం కలిగించడంతో పాటు.. బ్లాక్‌మెయిల్ కూడా చేస్తున్నారని పలువురు సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి'కి మద్దతు తెలిపిన ప్రజలందరికీ కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీఏ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, పృధ్వీరాజ్ కపూర్ సంయుక్తంగా శనివారంనాడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడైతే రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో అక్కడ తాము గెలిచామని ఈ సందర్భంగా శరద్ పవార్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడుతుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారంనాడు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు పూర్తయి, కౌంటింగ్‌కు ఒకరోజు ముందు ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుండటం ఇదే మొదటిసారి.