ఒకరికి తొమ్మిదికి మించి సిమ్‌లు ఉంటే
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:30 AM
ఇప్పటికే తొమ్మిది లేదా అంతకుమించి ఎక్కువ మొబైల్ కనెక్షన్‌లు కలిగి ఉన్న చందాదారులకు కొత్త సిమ్‌కార్డులు...
కొత్త కనెక్షన్ ఇవ్వడం కుదరదు: కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఇప్పటికే తొమ్మిది లేదా అంతకుమించి ఎక్కువ మొబైల్ కనెక్షన్‌లు కలిగి ఉన్న చందాదారులకు కొత్త సిమ్‌కార్డులు ఇవ్వొద్దని టెలికం ఆపరేటర్లను టెలికమ్యూనికేషన్‌ల శాఖ ఆదేశించింది. అలాంటి చందదారులను గుర్తించి, నిరోధించేందుకు వీలుగా ఈనెల 24నాటికి సంస్థాగత చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. తొమ్మిది, అంతకు మించి సిమ్‌లు ఉన్న చందాదారులకు కొత్త మొబైల్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడదని తెలియజేయాలని పేర్కొంది. నిర్దేశిత పరిమితికి ఇప్పటికే చేరుకున్న ప్రతి చందాదారుడి ఫొటో ఆగస్టు 23నుంచి డిజిటల్ ఇంటెలిజన్స్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంటుందని టెలికం శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..