పెన్షన్‌కు ఇక కొత్త విధానం ప్రయోజనాలకు కోత
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:25 AM
ప్రస్తుతం అమలులో ఉన్న అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్‌ఓ అడుగులు వేస్తోంది. ఈ కొత్త...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రస్తుతం అమలులో ఉన్న అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్‌ఓ అడుగులు వేస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనల వల్ల విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది. ఈ నూతన ప్రతిపాదనలను 2014 సెప్టెంబరు 1 నుంచి లేదా ప్రకటించిన తేదీ నుంచి కానీ అమలు చేసే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా సురజిత్ భట్టాచార్య అడిగిన ప్రశ్నకు గత వారం వచ్చిన సమాధానంతో ఈ నూతన ప్రతిపాదనల సమాచారం వెలుగులోకి వచ్చింది.
నూతన పథకానికి సంబంధించిన ప్రతిపాదనా పత్రాలను 2024 డిసెంబరులోనే ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ అయిన కేంద్ర కార్మిక శాఖ మంత్రికి సమర్పించారు. ఆ తరువాత ఈపీఎఫ్‌ఓ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ప్రో రేటా పద్ధతిని అమలు చేస్తామని, అధిక పెన్షన్లు పొందుతున్న వారికి పెన్షన్ చెల్లింపుల్లో భారీ తగ్గుదల ఉంటుందని దానిలో పేర్కొంది. ఈ మొత్తానికి కార్మిక శాఖ అండర్ సెక్రటరీ ఆమోదం కూడా లభించింది. ప్రో రేటా పద్ధతిలో పెన్షన్ లెక్కింపు, కొన్ని పీఎఫ్ ట్రస్టుల నుంచి పెన్షన్ దరఖాస్తుల తిరస్కరణ వంటివి ఆమోదించిన వాటిలో ఉన్నాయి.
ప్రతిపాదనలు ఇవీ..
జీతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పెన్షన్ ఫండ్‌లో తప్పనిసరిగా నమోదు కావాలి. యజమాని తన వాటాకింద ఇప్పటి వరకూ చెల్లిస్తున్నట్లే 8.33ు%చెల్లించాలి. కనీస పెన్షన్ అమలు కోసం కేంద్రం ప్రత్యేకంగా 1.16% చెల్లిస్తుంది. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న జీతం గరిష్ఠ పరిమితికిపైన కంట్రిబ్యూషన్ చెల్లించాలా లేదా అన్నది ఉద్యోగి ఇష్టమే. కనిష్ట పింఛనను వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచుతారు. దీని కోసం కేంద్రం కంట్రిబ్యూషన్‌ను వినియోగిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News