మానవాళికి సమానంగా ఏఐ ఫలాలు!
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:20 AM
‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే హితోక్తితో మొదలైన ‘ఢిల్లీ ఏఐ శిఖరాగ్ర సదస్సు’.. శనివారం ఆఖరి రోజున కూడా అదే స్ఫూర్తిని చాటే ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది. కృత్రిమ మేధ (ఏఐ)తో...
ఆ లక్ష్యంగా కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి
‘న్యూఢిల్లీ ఏఐ సదస్సు’ ఉమ్మడి ప్రకటన.. 88 దేశాల ఆమోదం
ప్రపంచ సహకారానికి ఇదొక మైలురాయి: కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే హితోక్తితో మొదలైన ‘ఢిల్లీ ఏఐ శిఖరాగ్ర సదస్సు’.. శనివారం ఆఖరి రోజున కూడా అదే స్ఫూర్తిని చాటే ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది. కృత్రిమ మేధ (ఏఐ)తో ఒనగూరే ప్రయోజనాల్ని ప్రపంచ మానవాళికి అంతటికీ సమానంగా పంచాలని ఈ ప్రకటన పేర్కొంది. ‘ఏఐ ప్రభావంపై న్యూఢిల్లీ డిక్లరేషన్’ పేరుతో ఉన్న ఈ ప్రకటనను అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌లతోపాటు 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదించాయని విదేశాంగశాఖ తెలిపింది. ఏఐ రంగంలో ప్రపంచ సహకారానికి సంబంధించి ఇదొక మైలురాయి అని వెల్లడించింది. ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమం కోసం ఏఐ ఉపయోగపడాలన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయానికి నిదర్శనమని పేర్కొంది. కాగా, ‘న్యూఢిల్లీ ఏఐ ప్రకటన’ను ఏడు అంశాలు పునాదిగా రూపొందించారు. అవి.. ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక ప్రగతి- సామాజిక సంక్షేమం, సురక్షిత విశ్వసనీయమైన ఏఐ, సైన్స్ కోసం ఏఐ, సామాజిక సాధికారత అవకాశాలు, మానవ వనరుల అభివృద్ధి, సమర్థవంతమైన వినూత్నమైన ఏఐ వ్యవస్థలు. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఏఐ కీలక అంశంగా మారుతుందని, దీర్ఘకాలిక అంతర్జాతీయ ఒప్పందాలకు ప్రేరణగా నిలుస్తుందని ‘న్యూఢిల్లీ ఏఐ డిక్లరేషన్’ ఆశాభావం వ్యక్తం చేసింది. ఏఐ ఆధారిత పరిశోధనలను ముందుకు తీసుకెళ్లటానికి అంతర్జాతీయ శాస్త్ర పరిశోధన సంస్థల మధ్య ఏఐ నెట్‌వర్క్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సుస్థిర, సమర్థవంతమైన ఏఐ వినియోగానికి మార్గదర్శకాలను కూడా రూపొందించుకోవాల్సి ఉందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News