నేపాల్ వరదల్లో మాజీ కేంద్ర మంత్రి కోడలి గల్లంతు..
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:04 PM
నేపాల్ వరదల్లో మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కోడలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ గల్లంతయ్యారు..
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ వరదల్లో మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కోడలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ గల్లంతయ్యారు. శర్మిష్ట కోల్‌కతాకు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కైలాస మానససరోవర యాత్ర కోసం ఆగస్టు 21వ తేదీన నేపాల్ వెళ్లారు. ఆమె ఆగస్టు 25వ తేదీ (మంగళవారం) రాత్రి 11:30 గంటల సమయంలో శుభ్రాన్షు రాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను టిబెట్ సరిహద్దుకు సమీపంలోని 'కైరోంగ్' ప్రాంతంలో ఉన్నట్లు భర్తతో చెప్పారు.
బుధవారం ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ ఎత్తున మెరుపు వరదలు వచ్చాయి. అప్పటినుంచి శర్మిష్టతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. తన భార్య పేరు మిస్సింగ్ లిస్ట్‌లో ఉందని శుభ్రాన్షు రాయ్ ధ్రువీకరించారు. కేవలం శర్మిష్ఠ మాత్రమే కాకుండా, ఆమెతో పాటు యాత్రకు వెళ్లిన కోల్‌కతాకు చెందిన 32 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. వారి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు భారత రాయబార కార్యాలయాన్ని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
మంగళగిరికి అమరావతి నుంచే తాగునీరు: మంత్రి నారాయణ
నో ఎగ్జామ్.. అప్లై చేస్తే చాలు.. నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..