Share News

రైల్వేల్లో రద్దుకానున్న ఆర్‌ఏసీ..!

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:59 AM

దశాబ్దాల నాటి పాత రిజర్వేషన్‌ పద్ధతి ఆర్‌ఏసీ(రిజర్వేషన్‌ ఎగైనెస్ట్‌ క్యాన్సిలేషన్‌)ని రద్దుచేసే దిశగా రైల్వేశాఖ ఆలోచిస్తోంది

రైల్వేల్లో రద్దుకానున్న ఆర్‌ఏసీ..!
rail

న్యూఢిల్లీ, నవంబరు 13: దశాబ్దాల నాటి పాత రిజర్వేషన్‌ పద్ధతి ఆర్‌ఏసీ(రిజర్వేషన్‌ ఎగైనెస్ట్‌ క్యాన్సిలేషన్‌)ని రద్దుచేసే దిశగా రైల్వేశాఖ ఆలోచిస్తోంది. పార్లమెంటరీ ప్యానెల్‌ ఆర్‌ఏసీ కేటాయింపులోని హేతుబద్ధతను ప్రశ్నించడంతో ఈ ఆలోచన తలెత్తింది. రైలు రిజర్వేషన్‌ బోగీలో ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్‌ నిర్ధారణ కావాలి. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులు రైలులో ప్రయాణించడానికి వీలులేదు. ఈ రెండు విభాగాల మధ్యలో ఉన్నదే ఆర్‌ఏసీ. ఆర్‌ఏసీ టికెట్‌తో రైలులో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే బోగీలోని సైడు బెర్తును మరొకరితో కలిపి షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బెర్త్‌ను పగలు సీటుగా మార్చుకుని కూర్చోవాలి. రాత్రి సమయంలో ఒకే బెర్తును ఇద్దరూ షేర్‌ చేసుకోవాలి. ఆర్‌ఏసీ టికెట్‌ కేటాయింపులో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ అయితే ఇబ్బంది తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో వాటిని సర్దలేక టీటీలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. పూర్తి సొమ్ము చెల్లించి ఇలా ఇబ్బంది పడుతూ ప్రయాణించడంలో హేతుబద్ధతను పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రశ్నించింది. మాన్యువల్‌గా రిజర్వేషన్లు నడిచినప్పుడు ప్రవేశపెట్టిన పద్ధతిని అధునాతన కంప్యూటరైజ్డ్‌ విధానం అమలవుతున్న కాలంలోనూ కొనసాగించడం అర్థంలేనిదని ప్యానెల్‌ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రైల్వే ఆర్‌ఏసీని రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మ‌ృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు

Updated Date - Nov 14 , 2026 | 04:59 AM