తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకాల ఖరారు... అన్నాడీఎంకేకు 170, బీజేపీకి 27 సీట్లు
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:52 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ తమిళనాడు విభాగం చీఫ్ నయనార్ నాగేంద్రన్, పీఎంకే(PMK) అధ్యక్షుడు అన్బుమణి రామదాస్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకర్ కూడా పాల్గొన్నారు.
పంపకాలు ఇలా..
సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. 2021లో బీజేపీకి కేటాయించిన సీట్ల కంటే 7 సీట్లు ఎక్కువగా ఈసారి కేటాయించారు. పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లు కేటాయించారు. అన్నాడీఎంకేకు సింహభాగం సీట్లు లభించాయి. 170కి పైగా సీట్లలో అన్నాడీఎంకే పోటీ చేయనుంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పీయూష్ గోయల్
సీట్ల పంపకాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, తామంతా ఒక కుటుంబమని, కలిసికట్టుగా విజయం కోసం పోరాతామని చెప్పారు. 27 సీట్లతో తాము సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర సంస్కృతిని స్టాలిన్, ఉదయనిధి అవమానించారని, ప్రజలు కూడా విసుగెత్తిపోయారని, ఈ ఎన్నికలను తాము స్వీప్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్‌ను దాటిన భారత నౌకలు జగ్ వసంత్, పైన్ గ్యాస్
రాజకీయ పార్టీలకు ఈసీఐ ఉచిత ప్రసార సమయం.. డిజిటల్ వోచర్ల కేటాయింపు