ముంబై హిట్ అండ్ రన్ కేసు.. 16 రోజులు కోమాలో ఉండి..
ABN , Publish Date - Mar 20 , 2026 | 09:01 PM
హిట్ అండ్ రన్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ హర్మాన్ కౌర్ చనిపోయింది. 16 రోజులకు పైగా కోమాలో ఉన్న ఆమె గురువారం ప్రాణాలు విడిచింది. కౌర్ మృతితో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై, పాలమ్ బీచ్ రోడ్డులో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ హర్మాన్ కౌర్ చనిపోయింది. 16 రోజులకు పైగా కోమాలో ఉన్న ఆమె గురువారం ప్రాణాలు విడిచింది. కౌర్ మరణంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండుకు చేరింది. యాక్సిడెంట్ తర్వాత కౌర్ స్పృహలోకి రాలేదు. దీంతో పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేయలేకపోయారు. కౌర్ మృతితో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. శుక్రవారం కోపర్‌ఖైరన్‌లో కౌర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..
మార్చి 3వ తేదీన 17 ఏళ్ల హర్మాన్ కౌర్.. 23 ఏళ్ల ప్రశాంత్ విజయ్ జమ్‌దాదే బైకుపై వెళుతోంది. సార్సోలే జంక్షన్ దగ్గర బైకు అదుపు తప్పింది. ఈ నేపథ్యంలోనే స్కోడా, మారుతీ బ్రెజా కార్లు బైక్‌ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కౌర్ తీవ్రగాయాలపాలైంది. తలకు బలమైన గాయం అవ్వటంతో కోమాలోకి వెళ్లిపోయింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన కౌర్‌ను డాక్టర్ డీవై పాటిల్ ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.
16 రోజులు చికిత్స చేసినా ఎలాంటి లాభం లేకుండాపోయింది. కౌర్ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను 23 ఏళ్ల సాగర్ సంద, 20 ఏళ్ల కృష్ణ రవారియాలుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. తమ కుమారుడి అకాల మరణానికి కారణమైన ఇద్దరినీ వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ప్రశాంత్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నాటో ఓ కాగితం పులి... విరుచుకుపడిన ట్రంప్
షోకాజ్ నోటీసు.. టీడీపీ హైకమాండ్‌కు ఎంపీ పుట్టా మహేశ్ వివరణ