Share News

లిఫ్ట్ కింద తల ఇరుక్కుని మహిళ మృతి.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 28 , 2026 | 09:02 PM

మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని సర్జికల్ లిఫ్ట్ కింద తల ఇరుక్కోవడంతో ఓ మహిళా కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..

లిఫ్ట్ కింద తల ఇరుక్కుని మహిళ మృతి.. వీడియో వైరల్
hospital accident India

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని సర్జికల్ లిఫ్ట్ కింద తల ఇరుక్కోవడంతో ఓ మహిళా కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది. నాసిక్‌లోని డాక్టర్ వసంతరావు పవార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి సర్జరీ విభాగంలో జ్యోతి శివాజీ (50) అనే మహిళ కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. సోమవారం విధి నిర్వహణలో భాగంగా శస్త్రచికిత్స పరికరాలను తరలించే ఫ్రైట్ లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ ఎక్కడ ఉందో గమనించడానికి జ్యోతి శివాజీ.. ఆ లిఫ్ట్ వెళ్లే మార్గంలో తల ఉంచి కిందకు వంగి చూశారు. అదే సమయంలో పైనుంచి లిఫ్ట్ వేగంగా కిందికి రావడంతో.. ఆమె తల లిఫ్ట్ కింద ఇరుక్కుపోయింది. అది గమనించిన సహ ఉద్యోగులు అప్రమత్తమై.. వెంటనే ఆమె తలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. ఈ ప్రమాదంలో జ్యోతి శివాజీ మృతి చెందారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.


సిబ్బంది సమాచారంతో నిపుణులు అక్కడికి చేరుకొని లిఫ్టును పైకి తీశారు. వెంటనే జ్యోతి శివాజీని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్

ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!

Updated Date - Apr 28 , 2026 | 09:36 PM