జ్యోతిష్యుడి అరాచకాలు.. 58 మంది మహిళలకు మాయమాటలు చెప్పి..
ABN , Publish Date - Mar 19 , 2026 | 09:11 PM
ఓ జ్యోతిష్యుడు మాయ మాటలు చెప్పి మహిళల్ని దారుణంగా మోసం చేశాడు. కష్టాల నుంచి గట్టెక్కిస్తానని నమ్మించి ఏకంగా 58 మంది మహిళలపై అత్యాచారం చేశాడు.
ముంబై, మార్చి 19: ఓ జ్యోతిష్యుడు మాయ మాటలు చెప్పి మహిళల్ని దారుణంగా మోసం చేశాడు. కష్టాల నుంచి గట్టెక్కిస్తానని నమ్మించి ఏకంగా 58 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ దృశ్యాలను రికార్డ్ సైతం చేశాడు. 35 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు జ్యోతిష్యుడిపై ఫిర్యాదు చేయటంతో అతడి గుట్టురట్టయింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాసిక్‌కు చెందిన 67 ఏళ్ల అశోక్ ఖరత్ అనే వ్యక్తి జ్యోతిష్యుడిగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అన్ని వర్గాలకు చెందిన సెలెబ్రిటీలు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. తాజాగా, 35 ఏళ్ల ఓ మహిళ నాసిక్ పోలీసులకు అశోక్‌పై ఫిర్యాదు చేసింది. అశోక్ తనను హిప్నటైజ్ చేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించగా.. ఆఫీస్‌లో సీక్రెట్ కెమెరాలు వెలుగుచూశాయి. పోలీసులు సీక్రెట్ కెమెరాలకు సంబంధించిన పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ పెన్ డ్రైవ్‌ను చెక్ చేసి చూడగా 58 మహిళలకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. మర్చంట్ నేవీలో పని చేసి రిటైర్డ్ అయిన అశోక్ జ్యోతిష్యం వైపు వచ్చాడు. కష్టాలు తీరుస్తానని చెప్పి ఆడవారిని నమ్మించేవాడు. అతడి మాటలు నమ్మిన వారికి మత్తు మందు ఇచ్చి హిప్నటైజ్ చేసేవాడు. తర్వాత వారిని భయపెట్టి అత్యాచారం చేసేవాడు. ఇక, అశోక్ అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. అశోక్‌కు ఢిల్లీ స్థాయి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్ వ్యవహారం రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతోంది.
ఇవి కూడా చదవండి
ఆహార కల్తీ నియంత్రణపై పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
హోర్ముజ్ మీదుగా వెళ్లాలంటే టోల్ ఛార్జ్.. ఇరాన్ సరికొత్త ప్లాన్ వేస్తోందా..