Share News

వ్యోమగాముల ఫుట్‌బాల్‌ ఆట!

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:17 AM

అంతరిక్షంలో నిరంతరం పరిశోధనలతో బిజీగా ఉండే వ్యోమగాములు.. వారాంతాల్లో ఫుట్‌బాల్‌ ఆడుతూ...

వ్యోమగాముల ఫుట్‌బాల్‌ ఆట!

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15: అంతరిక్షంలో నిరంతరం పరిశోధనలతో బిజీగా ఉండే వ్యోమగాములు.. వారాంతాల్లో ఫుట్‌బాల్‌ ఆడుతూ సందడి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లో గురుత్వాకర్షణ లేని( జీరో గ్రావిటీ) వాతావరణంలో ఫుట్‌బాల్‌ ఆడుతూ సరదాగా గడుపుతున్న వీడియోను భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి అనిల్‌మేనన్‌ సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘భూమిపై వేర్వేరు దేశాల ప్రజలను ఫుట్‌బాల్‌ ఆట ఎలా ఏకం చేస్తుందో, అంతరిక్ష కేంద్రంలోనూ మా అందరినీ ఒకే చోటికి చేర్చేది ఈ ఆట మాత్రమే’నని ఆయన పేర్కొన్నారు. ‘‘వారమంతా సాగే బిజీ షెడ్యూల్‌, కఠిన పరిశోధనల తర్వాత ఈ వీకెండ్‌లో ఇలా సేదతీరడం వల్ల రాబోయే కొత్త వారానికి మేము మళ్లీ సిద్ధమవడానికి ఎంతో సహాయపడుతుంది’’ అని వివరించారు. బంతితో పాటు వ్యోమగాములు గాలిలో తేలియాడుతూ ఆట ఆడుతున్న తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ‘‘ఇంతకంటే సరదాగా సాగే ఫుట్‌బాల్‌ ఆట మరోటి ఉండదేమో’’ అని ఒకరు స్పందిస్తే, ‘‘నాకు కూడా అక్కడకు వెళ్లి ఆడాలని ఉంది’’ అని మరొకరు కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:17 AM