Share News

ప్రపంచంలో కల్లోలం.. మనమే నిలదొక్కుకుంటున్నాం!

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:30 AM

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయని, కానీ, భారతదేశం మాత్రం నిలదొక్కుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోని...

ప్రపంచంలో కల్లోలం.. మనమే నిలదొక్కుకుంటున్నాం!

  • నోయిడాలో జేవర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్‌-1 ప్రారంభంలో మోదీ

న్యూఢిల్లీ/నోయిడా, మార్చి 28: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయని, కానీ, భారతదేశం మాత్రం నిలదొక్కుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాలు చమురు, ఆహారం, నిత్యావసరాల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ళోని నోయిడాలో జేవర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశలో నిర్మాణం పూర్తి చేసుకున్న టెర్మినల్‌ భవనాన్ని శనివారం ప్రధాని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ప్రయత్నిస్తుంటే.. భారత్‌ మాత్రం ఈ ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రతి చిన్నస్థాయిలోనూ అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజల మద్దతుతోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. ఇంత పెద్ద సంక్షోభ సమయంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఉండడమే కాకుండా ఓర్పుతో వ్యవహరించాలని సూచించారు. రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సమష్టి కృషి, ఐక్యతతోనే వికసిత్‌ భారత్‌ సాకారం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘ప్రస్తుతం విమర్శలు చేసేవారు రాజకీయంగా కొన్ని పాయింట్లు సంపాయించుకోగలరు. కానీ, ఇలాంటి చర్యలను ప్రజలు సహించరు. వారు వదిలి పెట్టరు. కరోనా సమయంలోనూ ఇలాంటి ప్రచారమే చేశారు. కానీ.. ప్రజలు వారిని తిప్పికొట్టారు’’ అని యూపీ విపక్షం సమాజ్‌వాదీపార్టీపై ప్రధాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంతో ఉత్తరప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. అదేవిధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశం ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:30 AM