Share News

వేగంగా వెళ్తున్న రైలు.. కిటీకి నుంచి దూసుకొచ్చిన రాయి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:52 PM

నాగ్‌పూర్‌ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ఊహించని ఘటన ఎదురైంది. వేగంగా వెళ్తున్న రైలుపైకి బయట నుంచి రాయి విసరడంతో బోగీ కిటికీ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.

వేగంగా వెళ్తున్న రైలు.. కిటీకి నుంచి దూసుకొచ్చిన రాయి.. వీడియో వైరల్..
Duronto Express stone attack

ఇంటర్నెట్ డెస్క్: నాగ్‌పూర్‌ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ఊహించని ఘటన ఎదురైంది. వేగంగా వెళ్తున్న రైలుపైకి బయట నుంచి రాయి విసరడంతో బోగీ కిటికీ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అద్దం ముక్కలు ప్రయాణికులపై పడటంతో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి (Nagpur Mumbai Duronto Express).


నాగ్‌పూర్‌ నుంచి ముంబై వెళ్తున్న ప్రయాణికుల బృందం రైలులో భోజనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న రైలు కిటికీ నుంచి ఓ రాయి బలంగా దూసుకొచ్చింది. దీంతో అద్దం పగిలి ముక్కలు బోగీలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు ఓ ప్రయాణికుడు పేర్కొన్నాడు. చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు కూడా సమీపంలో కూర్చున్నాయని తెలిపాడు. కిటికీ గుండా రాయి దూసుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Duronto Express stone attack).


శుక్రవారం రాత్రి నాగ్‌పూర్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌ బోర్ఖేడీ స్టేషన్‌ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది (Train window shattered). రైలు నంబర్‌ 12290లోని ఏ-1, బీ-2, బీ-5 బోగీల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. రాత్రి సుమారు 8.27 గంటల సమయంలో బయట నుంచి రాళ్లు వచ్చి కిటికీలను తాకినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులెవరూ గాయాలపాలవలేదని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. బోర్ఖేడీ-సింధి మధ్య సుమారు 803 నుంచి 796 కిలోమీటర్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 26 , 2026 | 01:57 PM