మొజాంబిక్ హక్కుల కార్యకర్త మాచెల్‌కు ఇందిరా గాంధీ శాంతి పురస్కారం
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:39 AM
ప్రతిష్ఠాత్మక ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని మొజాంబిక్‌కు చెందిన హక్కుల కార్యకర్త, మానవతావాది గ్రాసా మాచెల్‌కు ప్రదానం చేశారు
మొజాంబిక్ హక్కుల కార్యకర్త మాచెల్‌కు ఇందిరా గాంధీ శాంతి పురస్కారం
న్యూఢిల్లీ, నవంబరు 19: ప్రతిష్ఠాత్మక ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని మొజాంబిక్‌కు చెందిన హక్కుల కార్యకర్త, మానవతావాది గ్రాసా మాచెల్‌కు ప్రదానం చేశారు. గురువారం ఢిల్లీ జవహర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ పురస్కారాన్ని మాచెల్‌కు అందజేశారు. మహిళా సాధికారత, బాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం, ఆఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం మాచెల్ చేసిన దశాబ్దాల సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. మాచెల్ జీవితం ధైర్యం, కరుణ, సేవకు ప్రతీకగా నిలుస్తుందని సోనియా కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ