Share News

సరిహద్దు నుంచి వాణిజ్యం వరకు.. మోదీ-జిన్‌పింగ్ భేటీలో కీలక అంశాలివే..

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:08 PM

ప్రధాని నరేంద్ర మోదీ-చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

సరిహద్దు నుంచి వాణిజ్యం వరకు.. మోదీ-జిన్‌పింగ్ భేటీలో కీలక అంశాలివే..
Modi Xi meeting

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ-చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దాదాపు ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం, 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో ఈ భేటీపై భారీ అంచనాలు ఉన్నాయి (Modi Xi meeting).


2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన ఒప్పందం తర్వాత సైనిక బలగాల ఉపసంహరణతో పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే సరిహద్దు సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ రోజు భేటీలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్-చైనా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది. సరిహద్దులో అపార్థాలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా దౌత్య, సైనిక మార్గాల్లో ఇరు దేశాలు సంప్రదింపులు కొనసాగనున్నాయి (BRICS Summit 2026).


మరో కీలక అంశం బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు. టిబెట్‌లో యార్లుంగ్ త్సాంగ్పోగా పిలిచే బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు విలువ సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉన్న భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది (India China relations).


మోదీ-జిన్‌పింగ్ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు కూడా కీలకంగా మారనున్నాయి (India China trade). చైనాతో భారత్‌కు భారీ వాణిజ్య లోటు ఉంది. 2025-26లో చైనా నుంచి భారత్ దిగుమతులు సుమారు 32 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. భారత ఉత్పత్తులకు కూడా చైనా మార్కెట్లో మరింత అవకాశాలు కల్పించాలని, వాణిజ్య అసమతుల్యతను తగ్గించాలని భారత్ కోరే అవకాశం ఉంది. అలాగే ప్రజల మధ్య సంబంధాలు, వీసాలు, నేరుగా విమాన సర్వీసులు గురించి చర్చ జరగనుంది.


ఇవి కూడా చదవండి..

అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..


భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు.

Updated Date - Sep 12 , 2026 | 04:08 PM