Mika Singh: శునకాల సంక్షేమానికి పదెకరాలిస్తా: మ్యూజిక్ డైరెక్టర్ మికాసింగ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:22 PM
దేశంలో ఇటీవల వీధికుక్కల దాడులు పెరిగిపోయి.. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు మికాసింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటిపై ప్రతికూల చర్యలేవీ చేపట్టవద్దని న్యాయస్థానాన్ని కోరుతూ.. వాటి నిర్వహణ కోసం కొంత భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టులో వరుస ఫిర్యాదులు వెల్లువత్తున్న నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, పాప్ సింగర్ మికాసింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు(Music Director Mika Singh). శునకాల సంక్షేమానికి సంబంధించిన అంశంపై వాటికి హాని కలిగించే చర్యలేవీ చేపట్టవద్దని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కుక్కలకు శిక్షణ పొందిన సంరక్షకుల సాయంతో ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించాలని ఆయన కోరారు. అందుకోసం తాను 10 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు మికాసింగ్(Mika Singh willing to donate 10 acres). ఈ మేరకు ఓ ఎమోషనల్ పోస్ట్‌ను జోడిస్తూ ఎక్స్ వేదికగా సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ భూమిలో వీధి కుక్కల కోసం ప్రత్యేక ఆశ్రయాలను నిర్మించడం సహా వాటి శుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించాలని మికాసింగ్ సూచించారు.
కాగా.. దేశవ్యాప్తంగా ఇటీవల పలుచోట్ల వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మికాసింగ్ ఈ మేరకు స్పందించారు. కుక్కకాటు, రేబిస్ ప్రమాదాలు, మున్సిపాలిటీలు సక్రమమైన చర్యలు చేపట్టకపోవడం వంటి సమస్యలతో వాటి నిర్వహణపై తీవ్ర ఆందోళనలు రేకెత్తాయి. ఈ సమస్యను సుమోటోగా స్వీకరించింది అత్యున్నత న్యాయస్థానం. మరోవైపు ఇదే అంశంపై.. ప్రముఖ నటి షర్మిలా ఠాకూర్(Sharmila Thakore) కూడా పిటిషన్ వేశారు. అయితే.. ఈ కేసుపై ఈ నెల 13న మరోసారి విచారణ జరగనుంది.
ఇవీ చదవండి:
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే అరెస్ట్..
గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..