జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. వలస కూలీ మృతి..
ABN , Publish Date - Jul 31 , 2026 | 09:19 PM
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కెల్లామ్ ఏరియాలో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఇంటర్‌నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కెల్లామ్ ఏరియాలో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆ ఇద్దరిని అధికారులు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు.
మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇవి కూడా చదండి
మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం.. 41 మంది మృతి..
కమర్షియల్ నౌకలపై దాడులు వద్దు! ఇరాన్‌కు స్పష్టం చేసిన మంత్రి జైశంకర్