Share News

మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం.. 41 మంది మృతి..

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:08 PM

మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం కారణంగా భారీ సంఖ్యలో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. సరిహద్దుల్లో ఉన్న కోస్తా తీర రక్షణ కంచెలను బద్దలు కొట్టే క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో మునిగి మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.

మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం..  41 మంది మృతి..
Ceuta migrant crisis

ఇంటర్‌నెట్ డెస్క్: మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం కారణంగా భారీ సంఖ్యలో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. గత 24 గంటల్లో మొరాకో దేశం నుంచి దాదాపు 60,000 మంది వలసదారులు ఒకేసారి స్పెయిన్ భూభాగమైన సియుటాలోకి దూసుకురావడానికి ప్రయత్నించారు. సరిహద్దుల్లో ఉన్న కోస్తా తీర రక్షణ కంచెలను బద్దలు కొట్టే క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో మునిగి మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం కారణంగా ఇప్పటివరకు 41 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.


సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు చెయ్యి దాటిపోతుండటంతో స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. స్వయంగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు యువకులను తప్పుదోవ పట్టించి మృత్యుముఖంలోకి నెట్టేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సరిహద్దుల రక్షణ కోసం భారీగా సైన్యం, డ్రోన్లు, స్కూబా డ్రైవర్లు, యుద్ధ నౌకలను రంగంలోకి దించారు. స్పెయిన్ రక్షణ బలగాలు దాదాపు 30,000 మందిని బలవంతంగా తిరిగి మొరాకో సరిహద్దు గేట్ల గుండా వెనక్కి పంపించేశాయి.


ఇవి కూడా చదవండి

కమర్షియల్ నౌకలపై దాడులు వద్దు! ఇరాన్‌‌కు స్పష్టం చేసిన మంత్రి జైశంకర్

పెట్టుబడులకు అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Jul 31 , 2026 | 09:16 PM