Share News

కమర్షియల్ నౌకలపై దాడులు వద్దు! ఇరాన్‌‌కు స్పష్టం చేసిన మంత్రి జైశంకర్

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:04 PM

గల్ఫ్‌లో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు.

కమర్షియల్ నౌకలపై దాడులు వద్దు! ఇరాన్‌‌కు స్పష్టం చేసిన మంత్రి జైశంకర్
Minister Jai Shankar

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. సరకు రవాణా నౌకలపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు జరగకూడదని స్పష్టం చేశారు. కమర్షియల్ నౌకలు, నావికులపై దాడులను ఖండిస్తున్నామని మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై ఇరాన్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకుందని చెప్పారు. ఈ విషయమై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.

ఇరాన్‌తో యుద్ధం అద్భుతంగా సాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో తాజాగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా దళాలు భీకర దాడులు చేస్తున్నాయని అన్నారు. ఇలా తాము విజయాలను దక్కించుకుంటూ వెళితే చివరకు వారు వెనక్కు మళ్లక తప్పదని అన్నారు.


మరోవైపు, ఇరాన్ తాజాగా చేసిన డ్రోన్ దాడులను కువైట్ శుక్రవారం ఖండించింది. ఈ దాడులతో కువైట్ సుస్థిరతకు, భద్రతకు ముప్పు పొంచి ఉందని అక్కడి విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. నిరంతరం దాడులు జరపడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఇరాన్‌కు తేల్చి చెప్పింది.


ఈ వార్తలనూ చదవండి:

వాళ్లు ఒక్కటైతే తట్టుకోలేం.. పాక్‌లో పీక్స్‌కు జెన్-జీ భయం

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం..

Updated Date - Jul 31 , 2026 | 09:35 PM