150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం..
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:33 PM
ఆస్ట్రేలియాలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ లైబ్రరీ నుంచి మిస్సైన పుస్తకం 150 ఏళ్ల తర్వాత వెనక్కు తిరిగొచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ లైబ్రరీ నుంచి మిస్సైన పుస్తకం 150 ఏళ్ల తర్వాత వెనక్కు తిరిగొచ్చింది. 1870లో ‘యాంటీక్విటీస్ ఆఫ్ ఏథెన్స్’ అనే పుస్తకం ఆస్ట్రేలియాలోని కియామా పబ్లిక్ లైబ్రరీ నుంచి మిస్ అయింది. ఓ వ్యక్తి తన ఇంటిని పునర్నిర్మిస్తుండగా ఫైర్ ప్లేస్‌లో ఆ పుస్తకం బయటపడింది. ఆ వ్యక్తి పుస్తకాన్ని కియామా పబ్లిక్ లైబ్రరీలో తిరిగిచ్చేశాడు. ఈ సంఘటనపై కియమా లైబ్రరీ మేనేజర్ మిషేల్ హడ్సన్ మాట్లాడుతూ..
‘ఆ పుస్తకాన్ని ఆలస్యంగా చెల్లించినందుకు 19 లక్షల రూపాయల ఫైన్ అయింది. బుక్ కవర్ మీద ఉన్న బ్రిటీష్ ‘త్రీ పెన్స్ ఏ వీక్’ ఓవర్ డ్యూ ఫీజు ప్రకారం 1870 నుంచి ఇప్పటి వరకు 19 లక్షల ఫైన్ పడుతుంది. లైబ్రరీ చరిత్రలో ఇలా జరగటం ఇదే మొదటి సారి. ఆ పుస్తకాన్ని చివరగా ఎవరు తీసుకెళ్లారనే సమాచారం లేదు. సాధారణంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకాలు ఉన్నాయి. అవి కూడా ఎస్టేట్స్ యజమానులు తీసుకెళ్లినవే ఉన్నాయి’..
‘లైబ్రరీ నిబంధనల ప్రకారం ఒక చందాదారుడు మళ్లీ పుస్తకాన్ని తీసుకోవాలంటే, అంతకుముందు తీసుకున్న పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయాలి. పాత బాకీలన్నింటినీ పూర్తిగా చెల్లించాలి. ఒక కుటుంబంలో కనీసం ఆరుగురు సభ్యులకు 'చదవడం వచ్చు' అని తెలిస్తేనే ఆ కుటుంబం గరిష్టంగా మూడు పుస్తకాల వరకు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. అలాగే, మద్యం మత్తులో వచ్చే వారికి పుస్తకాలను అప్పుగా ఇచ్చేవారు కాదు. ఈ పుస్తకాన్ని మళ్లీ పోగొట్టుకోవాలని అనుకోవటం లేదు. మళ్లీ ఓ 150 సంవత్సరాలు ఈ పుస్తకం కోసం ఎదురు చూడాలని లేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
వాళ్లు ఒక్కటైతే తట్టుకోలేం.. పాక్‌లో పీక్స్‌కు జెన్-జీ భయం
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష