Share News

మైక్రోసాఫ్ట్‌ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోతారా?

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:51 AM

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులను తగ్గించుకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది

మైక్రోసాఫ్ట్‌ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోతారా?
microsoft

  • ఉద్యోగులకు ‘వాలంటరీ ఎగ్జిట్‌’ ఆఫర్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులను తగ్గించుకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలనుకునే వారి కోసం పరిహారంతో కూడిన ‘వాలంటరీ ఎగ్జిట్‌’ (స్వచ్ఛంద నిష్క్రమణ) ఆఫర్‌ను ప్రకటించింది. భారత్‌తోపాటు, అమెరికా, యూకే, కెనడాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. భారత్‌లో మైక్రోసా్‌ఫ్టకు 23వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఎంత మంది దీనికి అర్హులన్నది స్పష్టత లేదు. కానీ, అంతర్జాతీయంగా 60వేల మంది దీనికి అర్హులని తెలుస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంస్థ ఉద్యోగుల్లో 27శాతం భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు ఈ వాలంటరీ ఎగ్జిట్‌ ఆఫర్‌ను ఎంపిక చేసుకోవడానికి డిసెంబర్‌ 1 వరకు గడువు ఉంటుంది. కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాది సర్వీసు కాలానికి ఒక నెల రోజుల మూల వేతనం(బేసిక్‌) పరిహారంగా లభిస్తుంది. ఉదాహరణకు 10ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి 10నెలల వేతనం లభిస్తుంది. దీనికితోడు ఆరోగ్య బీమా, కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించే విషయంలో సాయానికి వీలుగా ట్రాన్సిషన్‌ సర్వీస్‌ను ఉద్యోగులు పొందొచ్చు.


ఉద్యోగులను తగ్గించుకునేందుకేనా?

మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను సర్దుబాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమీ కోల్‌మన్‌ వెల్లడించారు. అర్హత కలిగిన ఉద్యోగులకు పూర్తి వివరాలతో కంపెనీ నుంచి మెయిల్‌ వస్తుందన్నారు. సంస్థలోని ఉద్యోగులు అందరికీ ఈ ఆఫర్‌ వర్తించదని.. ఎంపిక చేసిన విభాగాల్లో లెవల్‌70 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకే ఈ కార్యక్రమం పరిమితమని స్పష్టం చేశారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగడం అన్నది కంపెనీకి కొత్త అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) రాకతో టెక్నాలజీ ప్రపంచంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటుండడం, చాలా పనులను ఏఐ మోడళ్లు చేసేస్తుండడంతో.. మైక్రోసాఫ్ట్‌ ఈ విధమైన పథకంతో ముందుకు రావడం గమనార్హం. కాగా, ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌ ప్రకటించినప్పటికీ.. భారత్‌లో భారీ పెట్టుబడులు కొనసాగుతాయని మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది. 2025 నుంచి 2029 వరకు క్లౌడ్‌, ఏఐ సదుపాయాలపై(ఇన్‌ఫ్రా) 20.5 బిలియన్‌ డాలర్ల (రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్టు మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 04:52 AM