Share News

ఎంజీ నరేగా అద్భుత పథకం: సుప్రీంకోర్టు

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:08 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీ నరేగా) స్థానంలో కొత్త చట్టం వచ్చిన నేపథ్యంలో గతంలో అమలైన పాత పథకంపై సుప్రీంకోర్టు ప్రశంసలు...

ఎంజీ నరేగా అద్భుత పథకం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీ నరేగా) స్థానంలో కొత్త చట్టం వచ్చిన నేపథ్యంలో గతంలో అమలైన పాత పథకంపై సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది. ఎంజీ నరేగా ప్రయోజనకరమైన, సమర్థ పథకమని అభివర్ణించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్భుత పనితీరును కనబర్చిందని.. ఇది ఉచితంగా ప్రయోజనాలు అందించే పథకం కాదని, కార్మికుల శ్రమదోపిడీకి తావు లేదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. సామాజిక కార్యకర్త అరుణారాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నరేగా కింద ఆలస్యమైన వేతనాలను పరిహారంతో కలిపి చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని, పని హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పిటిషనర్‌ కోరారు.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 06:08 AM