బాలలపై లైంగిక వేధింపు కంటెంట్ నిరోధానికి
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:00 AM
ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ల రికమెండేషన్ అల్గారిథమ్స్ పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించేలా ఉండడం, వాటిలో వచ్చే కొన్ని ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్...
కఠిన చర్యలు తీసుకుంటున్నాం
8 గడిచిన 6 నెలల్లోభారత్‌లో అలాంటి 1.6 లక్షల ఖాతాలను తొలగించాం
8 కేంద్రం నోటీసుల వేళ మెటా వివరణ
న్యూఢిల్లీ, న్యూయార్క్, జూలై 8: ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ల రికమెండేషన్ అల్గారిథమ్స్ పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించేలా ఉండడం, వాటిలో వచ్చే కొన్ని ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ ఉండడంపై వివరణ కోరుతూ కేంద్రం జారీ చేసిన నోటీసులపై మెటా స్పందించింది. ఆ తరహా కంటెంట్‌ను అరికట్టడానికి తమ యాప్స్‌లో తీసుకుంటున్న కఠినమైన చర్యల గురించి ఒక బ్లాగు పోస్టులో వివరించింది. దీనికి అడ్డుకట్టవేయడానికి అధునాతన ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని, వాటి సాయంతో అలాంటి ఖాతాలను గుర్తించి తొలగిస్తున్నామని.. గత ఏడాది ఇలా 40లక్షల ఖాతాలను తొలగించామని.. తప్పుడు లింకులను బ్లాక్ చేస్తున్నామని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తమ యాప్స్‌ను వాడేవారిలో 98ు మంది మాట్లాడే భాషలను కవర్ చేసేలా తమ కొత్త ఏఐ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసినట్టు పేర్కొంది. గడిచిన ఆర్నెల్లలో ఒక్క భారతదేశంలోనే తమ ఏఐ టూల్స్.. ఇలాంటి లక్షా అరవై వేల ఖాతాలను తొలగించినట్టు మెటా వెల్లడించింది. కాగా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను మెటా ఉద్దేశపూర్వకంగానే యువ వినియోగదారులను బానిసలుగా మార్చేలా రూపొందించిందని, వాటి భద్రతపై ప్రజలను తప్పుదోవ పట్టించిందని పేర్కొంటూ అమెరికాలోని కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కోర్టును ఆశ్రయించారు. ఇందుకుగాను మెటా నుంచి 1.4 ట్రిలియన్ డాలర్ల పరిహారాన్ని (మన కరెన్సీలో ఏకంగా రూ.1.33 కోట్ల కోట్లు. ఇది మస్క్ మొత్తం ఆస్తి కన్నా ఎక్కువ) ఇప్పించాలని వారు కోరారు. ఈ కేసు ఆగస్టులో విచారణకు రానుంది. విచిత్రమేంటంటే.. అసలు మొత్తం మెటా మార్కెట్ విలువే 1.5 ట్రిలియన్ డాలర్లు. అలాంటి కంపెనీకి 1.4ట్రిలియన్ డాలర్లు జరిమానాగా వెయ్యాలని కోరడమంటే ఆ సంస్థను దివాలా తీయించడమే. కాబట్టి కోర్టు ఆయా రాష్ట్రాలు అడిగినంత జరిమానా వేయకపోవచ్చని, ఈ ఏడాది మార్చిలో న్యూమెక్సికో రాష్ట్రం ఇలాగే ‘బాలల భద్రత’ అనే అంశంపై మెటా మీద కోర్టులో కేసు వేస్తే.. కోర్టు రూ.3100 కోట్ల జరిమానా వేసింది.
మెటా కొత్త ఇమేజ్ జనరేటర్..
గూగుల్ నానో బనానా తరహాలో.. మెటా కూడా తాజాగా ‘మ్యూజ్ ఇమేజ్’ అనే ఏఐ ఇమేజ్ జనరేటర్‌ని విడుదల చేసింది. అయితే, ప్రస్తుతానికి దీన్ని అమెరికాలో ఇన్‌స్టా స్టోరీ్‌సలో, మెటా వెబ్‌సైట్‌లో, మెటా ఏఐ యాప్‌లో, అలాగే కొన్ని దేశాల్లో వాట్సాప్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. అయితే.. దీంట్లో ఉన్న ఒక ఫీచర్‌పై సోషల్ మీడియా వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ఫీచర్ సాయంతో.. ఇన్‌స్ట్రాగామ్‌లో పబ్లిక్ ఖాతాల ఫొటోలను ఉపయోగించి ఏఐ ఇమేజ్‌లను సృష్టించవచ్చు. అంటే.. ఆయా ఖాతాలకు సంబంధించిన వ్యక్తుల అనుమతి లేకుండానే వారి ఫొటోలను ఎవరైనా తీసుకుని ఏఐ సాయంతో ఇష్టం వచ్చినట్టుగా మార్చేసే ప్రమాదం ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఇన్‌స్టా వినియోగదారులు తమ ఖాతాను ‘ప్రైవేట్’లో పెట్టాల్సి ఉంటుంది. లేదా ఇన్‌స్టా ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, షేరింగ్ అండ్ రీయూజ్ ఆప్షన్ ఓపెన్ చేసి.. ఆ పేజీలో కింది భాగంలో ఉండే ‘ఎలో ఏఐ రీయూజ్’ (లేదా) ‘‘డేటా ఫర్ ఏఐ జనరేషన్’’ అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. కాగా.. మ్యూజ్ ఇమేజ్ లాగానే ‘మ్యూజ్ వీడియో’ అనే ఏఐ వీడియో జనరేటర్‌ను కూడా మెటా అభివృద్ధి చేసింది. కానీ ఇంకా అందరికీ అందుబాటులోకి తేలేదు.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్