కేరళంలో భారీ వర్షాలు.. వయనాడ్‌లో విరుచుకుపడిన కొండచరియలు..
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:31 PM
కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్ జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి. మంగళవారం మీప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.
కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్ జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి. మంగళవారం మీప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి (Wayanad Landslide).
వయనాడ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా మట్టి, బండరాళ్లు ఒక్కసారిగా కొండపై నుంచి కూలిపడి నిర్మాణ ప్రాంతాన్ని పూర్తిగా కప్పివేశాయి. ప్రమాదం సంభవించగానే అక్కడ ఉన్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో కనీసం ఐదుగురు గాయపడగా, మరికొందరు మట్టిలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు (Kerala Heavy Rains).

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు (Kerala Monsoon). భారీ వర్షాల కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. భారత వాతావరణ శాఖ కేరళంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు