Share News

అనలాగ్‌ పనీర్‌పై మహారాష్ట్రలో నిషేధం

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:53 AM

పాలతో తయారయ్యే పనీర్‌కు బదులుగా వస్తున్న అనలాగ్‌ పనీర్‌.. తయారీ, నిల్వ, విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని...

అనలాగ్‌ పనీర్‌పై మహారాష్ట్రలో నిషేధం

ముంబై, ఆగస్టు 5: పాలతో తయారయ్యే పనీర్‌కు బదులుగా వస్తున్న అనలాగ్‌ పనీర్‌.. తయారీ, నిల్వ, విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నిషేధాన్ని అతిక్రమించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఒక వేళ ఈ అనలాగ్‌ పనీర్‌ వల్ల ఎవరైనా మరణిస్తే బాధ్యులకు జీవిత ఖైదుతోపాటు కనీసం రూ.10లక్షల జరిమానా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఛత్తీ్‌సగఢ్‌ తర్వాత అనలాగ్‌ పనీర్‌పై నిషేధం విధించిన దేశంలోని రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. సాధారణంగా పనీర్‌ను పాల నుంచి తయారు చేస్తారు. అయితే, పాల కొవ్వుకు బదులుగా పామాయిల్‌ వంటి వెజిటెబుల్‌ ఆయిల్స్‌, స్టార్చ్‌, పాల పొడి వంటివి ఉపయోగించి తయారు చేసే పనీర్‌ను అనలాగ్‌ పనీర్‌ అంటారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 05:53 AM