మీరేమీ ఇంగ్లండ్ రాజు కాదు..విచారణకు రండి!
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:58 AM
ఓ కేసు విచారణకు సంబంధించి కింది కోర్టులో హాజరు కాకుండా మినహాయింపు కోరిన తమిళనాడు ఆర్థిక మంత్రి మరియా విల్సన్‌కు మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ‘మీరేమీ...
మంత్రి మరియా విల్సన్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
చెన్నై, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఓ కేసు విచారణకు సంబంధించి కింది కోర్టులో హాజరు కాకుండా మినహాయింపు కోరిన తమిళనాడు ఆర్థిక మంత్రి మరియా విల్సన్‌కు మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ‘మీరేమీ ఇంగ్లండ్‌కు రాజు కాదు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంతటి వారే న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకంటే మీరేమీ గొప్పవారు కాదు. మంత్రులేమీ చట్టానికి అతీతులు కాదు. విచారణకు హాజరు కావాల్సిందే..’ అని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. 2022లో పుదుచ్చేరిలోని తన సోదరుడు, మరదలిపై దాడికి సంబంధించి విల్సన్‌పై లాస్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు