Share News

రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం అవినీతి చర్యా?

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:18 AM

తమిళనాడు సీఎం విజయ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే విజయ్‌ రూ.600 కోట్ల ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో..రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం ‘అవినీతి చర్య’గా పరిగణించవచ్చా? అని ప్రశ్నించింది.

రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు  వెల్లడించకపోవడం అవినీతి చర్యా?
tamilnadu cm vijay

  • ఆడిటర్‌ పొరపాటుకు ఎన్నికను రద్దు చేయాలా?

  • తమిళనాడు సీఎం విజయ్‌ ఎన్నికపై పిటిషన్‌

  • విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే విజయ్‌ రూ.600 కోట్ల ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో..రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం ‘అవినీతి చర్య’గా పరిగణించవచ్చా? అని ప్రశ్నించింది. ఎన్నికల అఫిడవిట్‌ను సిద్థం చేసిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కొన్ని ఆస్తుల వివరాలను పొరపాటున నమోదు చేయకపోతే.. అందుకు ఎన్నికను రద్దు చేయాలా? అని అడిగింది. రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం వల్ల పెరంబూరు ఓటర్లు ప్రభావితమయ్యారా? అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. విజయ్‌ 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒక ఓటరు విజయ్‌కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయనకు అదనంగా రూ.30 కోట్ల ఆస్తులు ఉన్నాయా లేదా అన్నది ఓటు నిర్ణయంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందని ప్రశ్నించారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.

యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.

Updated Date - Oct 08 , 2026 | 04:19 AM