Share News

తక్కువ స్పీడ్‌ బ్యాటరీ బైకులకు నో రూల్స్‌!

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:21 AM

తక్కువ స్పీడ్‌తో నడిచే బ్యాటరీ బైకులకు మోటారు వాహన నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది...

తక్కువ స్పీడ్‌ బ్యాటరీ బైకులకు నో రూల్స్‌!

న్యూఢిల్లీ, ఆగస్టు 28: తక్కువ స్పీడ్‌తో నడిచే బ్యాటరీ బైకులకు మోటారు వాహన నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మోటారు వాహనాల చట్టం-1989లో మార్పులు చేయనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను గురువారం విడుదల చేసింది. ఈ మేరకు చట్టంలో చేసే సవరణలు ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 0.6 కేవీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన, గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ స్పీడ్‌తో నడిచే బ్యాటరీ బైకులకు మోటారు వాహన నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. అయితే, కేంద్రీయ రహదారి పరిశోధనా సంస్థలో మాజీ రోడ్డు భద్రతా శాస్త్రవేత్త అయిన వేలుమురుగన్‌ దీనిపై స్పందిస్తూ కనీసం ఈ వాహనదారులు హెల్మెట్‌ వాడకాన్ని అయినా తప్పనిసరి చేస్తే బావుంటుందని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 06:21 AM