Share News

కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:48 AM

కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ నియామకాలలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)...

కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఈడీ సోదాలు

బెంగళూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ నియామకాలలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు, పలు జిల్లాలు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సహా మొత్తం 21 చోట్ల ఏకకాలంలో మంగళవారం దాడులు జరిపారు. కేపీఎ్‌ససీ కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. ఈ వ్యవహారంలో కేపీఎ్‌ససీ చైర్మన్‌ శివశంకరప్ప సాహకార్‌ సస్పెండైన విషయం తెలిసిందే. శివశంకరప్ప ఉంటున్న డాలర్స్‌ కాలనీలోని ఇల్లు, కలబురగి జిల్లా ఆళందలోని నివాసంపైనా, కేపీఎ్‌ససీ ద్వారా వెటర్నరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు పొందిన పలువురి నివాసాలపైనా ఈడీ దాడులు జరిపింది. కేపీఎ్‌ససీ ఆధ్వర్యంలో జరిగిన పశువైద్యాధికారుల నియామకంలో ఒక్కో అభ్యర్థి నుంచి శివశంకరప్ప రూ.70-80 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, కేపీఎ్‌ససీ చైర్మన్‌ శివశంకరప్ప సాహుకార్‌ను సస్పెండ్‌ చేస్తూ గవర్నర్‌ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 06:48 AM