డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చెరువులోకి కారు.. 42 ఏళ్ల మహిళ మృతి..
ABN , Publish Date - Aug 12 , 2026 | 09:47 PM
డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 42 ఏళ్ల సుమిత్ర దాస్ మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 42 ఏళ్ల సుమిత్ర దాస్ మృతి చెందారు. ఈ ఘటన కోల్‌కతాలోని కేస్టోపూర్‌లోని ప్రఫుల్ల కనన్ ప్రాంతంలో బుధవారం జరిగింది (Kolkata Woman Car Accident).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్ర దాస్ తన కుమార్తెను పాఠశాలలో దించి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వచ్చారు. స్కూటర్‌ను ఇంటి వద్ద ఉంచి, ఇటీవల భర్త కొనుగోలు చేసిన హ్యుందాయ్ ఈయాన్ కారును బయటకు తీశారు. ఆమెకు డ్రైవింగ్‌లో ఇంకా పూర్తిస్థాయి అనుభవం లేదు. ఆగస్టు 22న డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఉండటంతో దాని కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది (Kolkata Pond Accident).
బ్రేక్‌కు బదులుగా పొరపాటున యాక్సిలరేటర్‌ను తొక్కడంతో కారు వేగంగా చెరువు మధ్యలోకి దూసుకెళ్లింది (Driving Practice Accident). కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు గంటకు పైగా సాగిన సహాయక చర్యల అనంతరం కారును చెరువు నుంచి బయటకు తీశారు. అప్పటికే సుమిత్ర మృతి చెందారు. సుమిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..
భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి