Share News

కోల్‌కతాలో భూకంపం..

ABN , Publish Date - Feb 27 , 2026 | 02:20 PM

కోల్‌కతాలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌లో 5.4గా నమోదైంది.

కోల్‌కతాలో భూకంపం..
Kolkata Earthquake

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలో భూకంపం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం 1:22 గంటల ప్రాంతంలో సుమారు 45 సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఈ భూకంపానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కోల్‌కతా మాత్రమే కాకుండా హౌరా, హుగ్లీ, సుందర్‌బన్స్ ప్రాంతాలు కూడా భూకంప ప్రభావానికి గురయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌లో 5.4 గా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, ప్రజలు సురక్షితంగా ఉన్నారని సమాచారం.


కేంద్రమంత్రి సుకాంత మజుందార్ కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో భూమి ప్రకంపించిన వీడియో సోషల్ మీడియాలో ఒకటి వెరల్‌గా మారింది. ఐఏఎన్ఎస్ దీనిపై ట్వీట్ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

వసంత కాలం.. మోదుగుపూల సోయగం

వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు

Read Latest National News

Updated Date - Feb 27 , 2026 | 04:22 PM