కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను హత్య చేసి రైల్వే ట్రాక్ వద్ద పడేసిన భార్య..
ABN , Publish Date - Oct 18 , 2026 | 09:39 AM
కేరళలోని కొచ్చిలో ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడనే ఆరోపణతో తన భర్తను ఓ మహిళ హత్య చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలోని కొచ్చిలో ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడనే ఆరోపణతో తన భర్తను ఓ మహిళ హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్ సమీపంలో పడేసింది. మొదట రైలు ప్రమాదంగా భావించారు. అయితే అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉండడంతో విచారణ జరిపి అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు (Kochi Murder Case).
అక్టోబర్ 17 తెల్లవారుజామున ఎర్నాకుళం దగ్గర ట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని రైలు లోకో పైలట్ గుర్తించారు. వెంటనే రైల్వే రక్షణ దళానికి సమాచారం అందించారు. రైలు ఢీకొనడం వల్లే ఆ వ్యక్తి చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రాథమిక పరిశీలనలో పోలీసులకు అనుమానాలు కలిగాయి. దీంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో మృతుడు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన కుటుంబం కొచ్చిలో నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది (Kochi Crime News).
కుటుంబ సభ్యులను విచారిస్తున్న సమయంలో భార్య చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు (Minor Abuse Allegation). అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరకు తానే తన భర్తను చంపినట్టు ఆమె అంగీకరించింది. తన మొదటి వివాహం ద్వారా కలిగిన 16 ఏళ్ల కుమార్తెపై భర్త లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని, ఈ కారణంగానే అతడిపై దాడి చేసినట్లు ఆమె చెప్పింది. దీంతో పోలీసులు బాధిత బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..