Share News

కోచి పోలీస్‌ కమిషనర్‌పై వేటు!

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:15 AM

కేరళలోని కోచిలో జడ్జి మైనర్‌ కుమారుడి హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అతివేగంగా బెంజ్‌కారు నడిపి ఒకరి మృతికి కారణమైన జడ్జి కుమారుడిపై సులువుగా బెయిల్‌ వచ్చే సెక్షన్లతో కేసు నమోదుతోపాటు చట్టవిరుద్ధంగా వ్యవహరించిన కోచి పోలీస్‌ కమిషనర్‌ కాళీరాజ్‌ మహేశ్‌కుమార్‌ను కేరళ ప్రభుత్వం బదిలీ చేసింది.

కోచి పోలీస్‌ కమిషనర్‌పై వేటు!
kochi

  • జడ్జి కుమారుడి హిట్‌ అండ్‌ రన్‌ కేసులో

  • సీపీతోపాటు మరో నలుగురి పోలీసులపై చర్యలు

కోచి, అక్టోబరు 28: కేరళలోని కోచిలో జడ్జి మైనర్‌ కుమారుడి హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అతివేగంగా బెంజ్‌కారు నడిపి ఒకరి మృతికి కారణమైన జడ్జి కుమారుడిపై సులువుగా బెయిల్‌ వచ్చే సెక్షన్లతో కేసు నమోదుతోపాటు చట్టవిరుద్ధంగా వ్యవహరించిన కోచి పోలీస్‌ కమిషనర్‌ కాళీరాజ్‌ మహేశ్‌కుమార్‌ను కేరళ ప్రభుత్వం బదిలీ చేసింది. మరో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసింది. ఆదివారం తెల్లవారుజామున కోచిలోని చెరానెల్లూరులో వేగంగా వస్తున్న బెంజ్‌ కారు స్కూటర్‌పై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. స్కూటర్‌పై వెళుతున్న జయబాలకృష్ణన్‌ అనే 55ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ప్రమాద సమయంలో కారును నడుపుతున్నది త్రిస్సూర్‌కు చెందిన అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి 17ఏళ్ల కుమారుడిగా గుర్తించారు. అయితే, కోచి పోలీసులు.. జడ్జి కుమారుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగడంతో.. జడ్జి మైనర్‌ కుమారుడిని తిరిగి అదుపులోకి తీసుకుని, జువైనైల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట హాజరుపర్చగా, అక్కడ బెయిల్‌ మంజూరై విడుదలయ్యాడు. నిందితుడిని కాపాడేందుకు జడ్జి, పోలీసులు కుమ్మక్కయ్యారని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ అంశంపై కేరళ అసెంబ్లీ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి.


ఈ క్రమంలో కేరళ సీఎం వీడీ సతీశన్‌ కఠిన చర్యలకు ఆదేశించారు. విచారణ జరిపిన కోచి ఐజీ నిశాంతిని.. పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేల్చారు. నిందితుడిపై నేరపూరితంగా మరణానికి కారణమైనట్టుగా సెక్షన్లను చేర్చారు. అతడి బెయిల్‌ రద్దు చేయాల్సిందిగా జువైనైల్‌ జస్టిస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక ప్రభుత్వం కోచి సీపీని బదిలీ చేయడంతోపాటు ఒక సీఐ, ముగ్గురు పోలీసులను సస్పెండ్‌ చేసింది. మరోవైపు హైకోర్టు అనుమతితో నిందితుడి తండ్రి (జడ్జి)పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Updated Date - Oct 29 , 2026 | 07:29 AM