దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ అసత్య ప్రచారం
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:47 AM
‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఆర్థిక సునామీ వచ్చే...
ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారం: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఆర్థిక సునామీ వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశప్రజలలో లేని భయందోళనలను రెచ్చగొట్టేందుకే రాహుల్ ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన ముడి చమురు ధరలు, ఆర్థికంగా ప్రపంచం అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతోందని పేర్కొన్నారు. 140 కోట్ల ప్రజల సహకారంతో గత దశాబ్దకాలంలో ప్రధాని మోదీ దేశ ఆర్థికవ్యవస్థను మరింత పటిష్టం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్