Share News

ప్రధాని మోదీకి లేఖ రాసిన విపక్ష నేత మల్లికార్జున ఖర్గే

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:55 PM

పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన సవరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

 ప్రధాని మోదీకి లేఖ రాసిన విపక్ష నేత మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge

ఇంటర్‌నెట్ డెస్క్: పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన సవరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు సర్వపక్ష సమావేశం నిర్వహించాలని, రాజకీయ పార్టీలు ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆయన కోరారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించలేకపోయిందని పేర్కొన్నారు.


అటువంటి విధానాన్ని మళ్లీ పునరావృతం చేయవద్దని కోరారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే ఎలాంటి నిర్ణయానికైనా కాంగ్రెస్, విపక్ష కూటమి మద్దతు ఇవ్వబోదని ఖర్గే తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాలను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.


kharghe.jpg


మహిళలకు చట్టసభల్లో కల్పించే 33 శాతం రిజర్వేషన్లను డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడాన్ని ఖర్గే తప్పుపట్టారు. ఈ అంశంపై తాను గతంలో జులై 16, 2026న కూడా లేఖ రాశానని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తాజా పరిణామాల నేపథ్యంలో మోదీకి మళ్లీ లేఖ రాయాల్సి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య అవగాహన ఒప్పందం

Updated Date - Aug 27 , 2026 | 05:02 PM