Share News

సియా గోయల్, చేతన్ చౌదరికి నాలుగు నెలల కిందటే వివాహం..!

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:34 PM

యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి నాలుగు నెలల కిందటే రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సియా గోయల్, చేతన్ చౌదరికి నాలుగు నెలల కిందటే వివాహం..!
Ketan Agarwal Case

మహారాష్ట్ర: యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి నాలుగు నెలల కిందటే రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేతన్ అగర్వాల్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత నిందితులిద్దరూ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నట్లు పుణె గ్రామీణ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఆధారాలు సేకరించే దిశగా విచారణ చేస్తున్నారు.


సియా, చేతన్ నిజంగా వివాహం చేసుకున్నారా లేదా? అని నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వారి పెళ్లికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం కోసం వేట ప్రారంభించారు. మరోవైపు, సాక్షులుగా సంతకాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోయల్ ఇద్దరు స్నేహితులను కూడా విచారిస్తున్నారు. అలాగే, సియా, చేతన్‌లు పెళ్లి దండలు ధరించిన ఫొటోలను ఓ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారని, అనంతరం వాటిని డిలీట్ చేశారని తెలుస్తోంది. ఆ ఫొటోలను తిరిగి పొందేందుకు పోలీసుల సాంకేతిక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.


కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్, సియా గోయల్‌కు వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించి నిశ్చితార్థం చేశారు. డిసెంబర్‌లో వివాహం చేయాలని తేదీ ఖరారు చేశారు. అయితే, ఆ పెళ్లి ఇష్టం లేని సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 18న పుణె సమీపంలోని లోహగడ్ కోటకు తీసుకెళ్లి, పక్కా ప్రణాళిక ప్రకారం కొండ పైనుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

రాముడి కానుకలన్నీ సేఫ్.. స్పష్టం చేసిన రామ్ మందిర్ ట్రస్ట్

సింగూర్ ఔట్.. ముఖర్జీ ఇన్.. బెంగాల్ పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పు.. సీఎం సూచన..

Updated Date - Jul 07 , 2026 | 03:56 PM