Share News

యాత్రికులకు కేరళం సూచనలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:51 AM

శబరిమలలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం సంరక్షణకు అయ్యప్ప భక్తులు సహకరించాలని కేరళం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది.

యాత్రికులకు కేరళం సూచనలు

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): శబరిమలలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం సంరక్షణకు అయ్యప్ప భక్తులు సహకరించాలని కేరళం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది. ఈ నెల 17 నుంచి వచ్చే జనవరి 20 వరకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించనున్న దీక్షాధారులు, భక్తులు, యాత్రికులకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని అయ్యప్ప భక్తులకు అవగాహన కల్పించాలని కోరిందని ఏపీ పీసీబీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. శబరిమల యాత్రా స్థలమైన సన్నిధానం, పంబా, నీలక్కల్‌, ఎరుమేలి అటవీ ప్రాంతాలు, కొండ మార్గాల్లో పర్యావరణానికి హాని చేయకుండా, పరిశుభ్రతను పాటించాలని సూచించింది. ఇరుముడిలో ప్లాస్టిక్‌ వస్తువులు వినియోగించకుండా, పర్యావరణ హితంగా ప్రత్యామ్నాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 12:56 AM