Share News

జ్ఞానేశ్‌పై విచారణకు కేరళం హోంమంత్రి ఆదేశం

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:56 AM

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై వచ్చిన రూ.2కోట్ల లంచం ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని కేరళం హోంమంత్రి రమేశ్‌ చెన్నితల విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశించారు

జ్ఞానేశ్‌పై విచారణకు కేరళం హోంమంత్రి ఆదేశం
gynesh

తిరువనంతపురం, నవంబరు 4: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై వచ్చిన రూ.2కోట్ల లంచం ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని కేరళం హోంమంత్రి రమేశ్‌ చెన్నితల విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశించారు. 2006లో కేరళంలో ‘కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌’ ‘(కేఎ్‌సటీపీ) కింద రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. ఆ సమయంలో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా పనిచేసిన జ్ఞానేశ్‌ కుమార్‌, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూ.17 కోట్ల బిల్లులను క్లియర్‌ చేయడానికి రూ.2 కోట్ల లంచం డిమాండ్‌ చేశారని సాజన్‌ అనే కాంట్రాక్టర్‌ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న మలేషియాకు చెందిన కన్సల్టింగ్‌ ఇంజనీర్‌ ‘లీ సీ బీన్‌’ ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆయన రాసిన సూసైడ్‌ నోట్‌లో కూడా ఈ లంచం వ్యవహారానికి సంబంఽధించిన ప్రస్తావన ఉందని తెలిపారు. ఈ ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న హోం మంత్రి రమేశ్‌ చెన్నితల విచారణకు ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీల)కు కల్పించిన చట్టపరమైన రక్షణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌(ఈసీఐ)లకు నోటీసులు జారీ చేసింది. అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం-2023లోని సెక్షన్‌ 16 రాజ్యాంగబద్ధతను పిటిషనర్‌ సవాల్‌ చేశారు. విధుల్లో భాగంగా సీఈసీ, ఈసీలు తీసుకునే నిర్ణయాలు, చర్యలపై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు కాకుండా.. కోర్టులు విచారణ చేపట్టకుండా సెక్షన్‌ 16 రక్షణ కల్పిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మీ కుమార్తె సుప్రియ సిద్ధంగా ఉన్నారు.. శరద్ పవార్‌తో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ!

ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..

Updated Date - Nov 05 , 2026 | 07:13 AM