తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:28 AM
సుప్రసిద్ధ కేధార్ నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం శాస్త్రోక్తంగా తెరుచుకున్నాయి. ఈ పవిత్రఘట్టాన్ని...
రుద్రప్రయాగ్/న్యూఢిల్లీ, ఏప్రి ల్ 22: సుప్రసిద్ధ కేధార్ నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం శాస్త్రోక్తంగా తెరుచుకున్నాయి. ఈ పవిత్రఘట్టాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ పేరు మీద ఆయన మొదటి పూజ నిర్వహించడం విశేషం. భక్తుల రాకతో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కాగా, చార్‌ధామ్ యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International