కర్ణాటకలో ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
ABN , Publish Date - May 24 , 2026 | 06:40 PM
కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పడవ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. మృతులలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం నదిలోకి వెళ్లిన పడవ బోల్తాపడటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తర కన్నడ జిల్లా తత్తెహక్కలు నదిలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. మృతులంతా భట్కల్ తాలూకాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read:
సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు